MDK: జిల్లాలో పెట్రోల్, డీజిల్‌ను డబ్బాలు, ప్లాస్టిక్ కంటైనర్లు, వాటర్ బాటిళ్లలో పోయడాన్ని పూర్తిగా నిషేధించాలని ఎస్పీ డీ.వీ. శ్రీనివాసరావు తెలిపారు. ఇంధనాన్ని డబ్బాలలో నిల్వ చేయడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా పెట్రోల్ బంకు సిబ్బంది డబ్బాలలో పోయరాదని సూచించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని బంకుల్లో ఈ నిబంధనలు అమలు చేయాలన్నారు.