MBNR: జిల్లా ఎస్పీ డి. జానకి పర్యవేక్షణలో సాగిన ఓ హత్యాయత్నం కేసులో నిందితులకు కోర్టు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2023లో చన్నారెడ్డిపల్లిలో భూ వివాదం నేపథ్యంలో చెన్నయ్యపై దాడికి పాల్పడిన వెంకటయ్య, శ్రీను, మల్లేష్లను దోషులుగా నిర్ధారిస్తూ జిల్లా కోర్టు ఈ తీర్పునిచ్చింది. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన నవాబ్ పేట పోలీసులను ఎస్పీ అభినందించారు.