SRD: జిల్లాలో పెట్రోల్ కొరత లేదని ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం తెలిపారు. పెట్రోల్ కోరత ఉందని తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా అక్రమంగా పెట్రోల్ డీజిల్ నిల్వ ఉంచితే చట్ట చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎవరైనా పెట్రోల్‌ను పక్క దారి పట్టిస్తే సమీప పోలీస్ స్టేషన్లో గాని, 8712656739 నెంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.