TPT: రోడ్డు ప్రమాదంలో గాయపడి స్థానిక హోలియోస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తుడా ఉద్యోగి దుర్గాప్రసాద్‌ను తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పరామర్శించారు. దుర్గాప్రసాద్ తిరుపతి రూరల్ మండలంలోని సీ గొల్లపల్లి గ్రామానికి చెందినవారు. ఆసుపత్రికి చేరుకున్న ఆయన, బాధితుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.