»Chandrababu Did Not See Excise Department Lokesh Said That He Did Not Sign
Nara Lokesh: చంద్రబాబు ఆ శాఖ చూడలేదు.. ఫైలుపై సంతకం చేయలేదు.
చంద్రబాబు అసలు ఎక్సైజ్ శాఖ చూడలేదు, ఆ ఫైలుపై సంతకం చేయలేదని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. జగన్ కుట్రకోణంలో భాగంగానే మరో తప్పుడు కేసు పెట్టారని విమర్శించారు.
Chandrababu did not see Excise Department. Lokesh said that he did not sign
Nara Lokesh: చంద్రబాబు (Chandrababu)పై ఏపీ సీఐడీ మద్యం అనుమతుల కేసు నమోదు చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) స్పందించారు. జగన్ తప్పుడు మద్యం కేసు పెట్టారని మండిపడ్డారు. ప్రివిలేజ్ ఫీజు రద్దు ఫైలు చంద్రబాబు వద్దకు రాలేదని లోకేశ్ స్పష్టం చేశారు. అసలు ఆయన ఎక్సైజ్ శాఖ చూడలేదని, ఆ ఫైలుపై సంతకం చేయలేదని పేర్కొన్నారు. ఈ తప్పుడు కేసులన్ని జగన్(YS Jagan) కుట్రలో భాగమన్నారు. సంబంధం లేని బాబును ఈ కేసులో ఏ3గా చేర్చారని ఆరోపించారు.కేవలం ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతో ఈ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం కేసులో ప్రభుత్వం అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తుందని లోకేష్ పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన రెండు కేసులపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.