»Ap High Court Notices To 41 People Including Cm Jagan
CM Jagan: సహా 41 మందికి నోటీసులు..అందుకేనా?
ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయానే అంశంపై ఎంపీ రఘురామ రాజు హైకోర్టు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు సీఎం జగన్ సహా 41 మందికి నోటీసులు జారీ చేసింది.
ap High Court notices to 41 people including CM Jagan
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(Andhra Pradesh High Court) సీఎం జగన్ మోహన్ రెడ్డి సహా మొత్తం 41 మందికి నోటీసులు జారీ చేసింది. ఏపీ రాష్ట్రంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఎంపీ రఘురామ కృష్ణం రాజు(raghu rama krishnam raju) దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు నోటీసులు పంపించింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలలో ఆర్థిక అక్రమాలు జరుగుతున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు దీనిపై అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించాలని రఘురామ రాజు తన పిటిషన్లో ప్రస్తావించారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన కోర్టు సీఎం సహా మంత్రులు, అధికారులను కూడా ప్రతివాదులుగా చేర్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.