HNK: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హనుమకొండ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో నిర్వహించిన స్వచ్ఛ గ్రంథాలయ కార్యక్రమంలో ఛైర్మన్ అజీజ్ ఖాన్ పాల్గొన్నారు. నిత్యం లైబ్రరీ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటామని, లైబ్రరీకి విచ్చేసే పాఠకులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గ్రంథాలయ కార్యదర్శి శశిజాదేవి ఉన్నారు.