WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన వరంగల్ భద్రకాళి అమ్మవారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఈరోజు 8వ రోజు ఉదయాన్నే ఆలయాన్ని తెరిచి, అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారికి లక్ష చామంతి పూలతో విశేష పుష్పార్చన నిర్వహించారు. ఈ మహత్తర ఘట్టాలను చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.