TG: ఆరోగ్యశ్రీపై విపక్ష సభ్యులు ఆరోపణలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాము ప్రతి నెలా రూ.89 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. గత ప్రభుత్వం రూ.600 కోట్లు బకాయిలు పెట్టిందని వెల్లడించారు. ఇప్పటివరకు రూ.2,408 కోట్ల బిల్లులు చెల్లించామని, తాము ఎప్పటికప్పుడు చెల్లిస్తూనే ఉన్నామని గుర్తు చేశారు. పేదలకు అన్యాయం జరుగుతోందంటూ అపోహలు కల్పిస్తున్నారని మండిపడ్డారు.