VKB: దర్శకుడు శ్రీను వైట్లకు వ్యవసాయ భూమి పేరుతో టోకరా వేశారు. వికారాబాద్ జిల్లా వాసులు, దాదాపు రూ. 7.2 కోట్ల విలువైన భూమిని ఆయనకు అమ్మారు. నకిలీ పత్రాలతో శ్రీను వైట్లను మోసం చేసిన ఈ వ్యక్తులు, భూమి విలువ పెరుగుతుందని ఆశ చూపారు. దర్శకుడు తన మేనకోడలు శ్వేతతో కలిసి 2019లో ఈ భూమిని కొనుగోలు చేశారు.