E.G: కేంద్రం తీసుకువస్తున్న వ్యాలిడేషన్ యాక్ట్‌ను ఉపసంహరించుకోవాలని ఏపీఎస్జీఆర్ఈఏ అధ్యక్షుడు పి.ఎస్.ఎ.ఎన్.పి శాస్త్రి డిమాండ్ చేశారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా జిల్లా అధ్యక్షుడు పల్లా సత్యనారాయణమూర్తి నేతృత్వంలో బుధవారం తూర్పు గోదావరి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కరువు భత్యం పెంపును ఈ చట్టం అడ్డుకుంటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.