TG: శ్రీరామనవమి సందర్భంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. వైన్ షాపులతో పాటు బార్లు, కల్లు దుకాణాలు, క్లబ్బులు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.