SRCL: ఇల్లంతకుంట మండలం రంగంపేట గ్రామంలో భర్తతో విడిగా ఉండటంతో మానసిక ఆందోళన చెంది తన మూడేళ్ల కొడుకుతో కలిసి రేఖ (25) బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త తనను పట్టించుకోవడం లేదని పేర్కొంటూ రేఖ ఆరు నెలలుగా తల్లి వద్ద ఉంటుంది. ఇంటికి సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు బుధవారం సాయంత్రం దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.