ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యాంశాలుగా హిందూ మత గ్రంథాలను ప్రవేశపెడతాం అంటూ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాఠశాలల్లో భగవద్గీత, శ్రీరామ చరితం,రామాయణం, మహాభారతం, ఉపనిషత్తులు, వేదాలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెడతాం అంటూ వ్యాఖ్యానించారు. ఇవి చదివితే మనిషిలో నైతికత పెరుగుతుందని నేటి బాలలే రేపటి పౌరులని భారత దేశ పౌరులకు నైతికత పెంపొందాలంటే హిందూ గ్రంధాలను చదవాలని అన్నారు. హిందూ గ్రంథాలన్నీ చాలా అమూల్యమైనవని… మనిషిని సంపూర్ణ వ్యక్తిగా, నైతికత గల వ్యక్తిగా తీర్చిదిద్దే సామర్థ్యం వీటికి ఉందని చెప్పారు. ఈ మాటలు నేను ఓ ముఖ్యమంత్రిగా చెబుతున్నానంటూ స్పష్టం చేశారు. ఇతర సబ్జెక్టులతో పాటు హిందూ గ్రంధాలను కూడా ప్రభుత్వం పాఠశాలల్లో మన మత గ్రంథాలన విద్యగా బోధించాల్సిన అవసరం ఉందన్నారు. తులసీదాస్ శ్రీరామ చరితం అనే గొప్ప పుస్తకాన్ని రాశారని పెర్కోన్నారు