సత్యసాయి: బుక్కపట్నం మండలం రసింపల్లి గ్రామంలో ఆధునిక మామిడి సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిజిటల్ గ్రీన్ ట్రస్ట్, ఉద్యాన శాఖ అధికారుల సమన్వయంతో జరిగిన ఈ శిబిరంలో మహిళా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధిక సాంద్రత సాగు, చీడపీడల నివారణ, నీటి యాజమాన్యంపై నిపుణులు అవగాహన కల్పించారు.