KNR: గంగాధర మండలం గర్శకుర్తి రైతు వేదికలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ పక్షాన రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించరు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త రాజేంద్రప్రసాద్ రైతులకు నానో యూరియా వాడకం, నూనె పంటల సాగు, వరి కొయ్యలు కాల్చడం వల్ల వచ్చే నష్టాల గురించి వివరించారు.