కృష్ణా: మొవ్వ మండలం కోసూరు గ్రామంలో అన్నదాత సుఖీభవ మూడవ విడత నగదు రైతుల ఖాతాలలో జమ అయిన సందర్భంగా, ‘రైతన్న మీకోసం’ అనే డోర్ టు డోర్ విజిట్ కార్యక్రమం బుధవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వర రావు పాల్గొని ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందించారు.