నిజామాబాద్: భీమ్గల్ పురపాలక సంఘం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.31.44 కోట్ల అంచనా బడ్జెట్ను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఛైర్పర్సన్ నాగమణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిషనర్ గంగాధర్ వివరాలు వెల్లడించారు. ఆదాయంలో ప్రభుత్వ గ్రాంట్లు రూ.27.77 కోట్లు కాగా, సొంత వనరులు రూ.3.61 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో నుంచి వివిధ పౌర సేవలు, నిర్వహణ కోసం రూ.2.94 కోట్లు కేటాయించారు.