ప్రకాశం: సింగరాయకొండ పట్టణంలో కూరగాయల మార్కెట్ సెంటర్ సమీపంలో ప్రధాన రహదారి మధ్యలో ఉన్న డివైడర్ను కొందరు బుధవారం రాత్రిపూట ధ్వంసం చేశారు. ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు అనువుగా చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. రోడ్డు భద్రత నిబంధనలను పాటించకుండా ఇలా చేసిన వారుపై అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.