HYD: నగరంలో పెరుగుతున్న అగ్నిప్రమాదాలు, ట్రాఫిక్ అడ్డంకులు అగ్నిమాపక సిబ్బందికి సవాల్‌గా మారాయి. ఇటీవల జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో ఫైరింజన్లు చేరడం 15 నిమిషాలు ఆలస్యం కావడంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో, ఇతర నగరాల తరహాలో సిగ్నల్ వ్యవస్థను ఆటోమేటిక్‌గా నియంత్రించే ‘స్మార్ట్ గ్రీన్ ఛానల్’ వ్యవస్థను ఇక్కడ కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది.