శ్రీరామనవమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు సెలవు ఉండనుంది. ప్రభుత్వాలు విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం శుక్రవారాన్ని పబ్లిక్ హాలిడేగా పేర్కొనడంతో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. అటు బ్యాంకులకు సైతం సెలవు ఉంది. 28న నాలుగో శనివారం, 29న ఆదివారం కాబట్టి వరుసగా 3 రోజులు బ్యాంకులు పని చేయవు.