AP: అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక సాంకేతికతను రాష్ట్ర పోలీసింగ్ వ్యవస్థలో భాగం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. సింగపూర్ పోలీస్ ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. సింగపూర్లో అమలు చేస్తున్న స్మార్ట్ పోలీసింగ్ విధానాలు, ఆధునిక సాంకేతిక భద్రతా వ్యవస్థలపై ఆమె అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.