పశ్చిమాసియా యుద్ధంతో దేశంలో గ్యాస్ కొరత పెరిగింది. దీనికి ‘బయో గ్యాస్’ ఉత్తమ ప్రత్యామ్నాయం. ప్రభుత్వాలు పల్లెల్లో పశువుల వ్యర్థాలతో బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే గ్యాస్ కష్టాలు కాస్త తప్పుతాయి. స్థానిక అవసరాలు తీరడమే కాక, నగరాలకు కూడా గ్యాస్ సరఫరా చేయవచ్చు. తద్వారా విదేశీ చమురుపై ఆధారపడటం తగ్గి, తక్కువ ఖర్చుతోనే వంట గ్యాస్ అందుబాటులోకి వస్తుంది.