ఖమ్మం జిల్లా యువతకు పీఎం ఇంటర్న్‌షిప్ పథకం కింద ప్రముఖ కంపెనీల్లో శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం టి.సీతారాం తెలిపారు. 18-25 ఏళ్ల లోపు వయస్సు ఉండి పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు దీనికి అర్హులన్నారు. ఎంపికైన వారికి నెలకు స్టైపెండ్‌తో పాటు బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆసక్తిగల వారు వెంటనే అధికారిక పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.