ప్రకాశం: గుడ్లూరుకు చెందిన ఓ మహిళ బస్సులో మరిచిపోయిన సుమారు రూ.2 లక్షల విలువైన గోల్డ్ బ్రాస్లెట్ను మరిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసు బస్సు సిబ్బందిని సంప్రదించగా, కండక్టర్ చంద్రమోహన్ రావు ఆభరణాన్ని భద్రంగా ఉంచి గుడ్లూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి బాధితురాలికి అప్పగించాడు. దీంతో సదరు మహిళ కుటుంబ సభ్యులు కండక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.