SDPT: హుస్నాబాద్ పట్టణంలో పోలీసులు ఇవాళ ఆకస్మిక సోదాలు చేపట్టారు. పలు ప్రైవేట్ దుకాణాలను తనిఖీ చేసిన సందర్భంగా ఒక దుకాణంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి, వాటి నుంచి 5 కేజీల సిలిండర్లలో గ్యాస్ నింపుతున్నట్టు గుర్తించారు. వెంటనే పోలీసులు డొమెస్టిక్ సిలిండర్లతో పాటు 20 చిన్న సిలిండర్లను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు.