IND vs NZ 3rd ODI: నేడు ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ లో ఇది చివరి మ్యాచ్. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. స్వదేశంలో వరుస మ్యాచ్ లు ఆడుతున్న టీమిండియా ఈ మధ్యనే శ్రీలంక టీమ్ తో జరిగిన వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా ఇప్పుడు న్యూజిలాండ్ జట్టుపై రెండు మ్యాచ్ లను గెలిచింది. ఇక మూడో వన్డేలో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది.
టీమిండియాలో యువ ఆటగాళ్లు అద్భుత ప్రతిభ చూపుతున్నారు. బ్యాటింగ్ పరంగాను, బౌలింగ్ పరంగానూ జట్టు బలంగా ఉంది. మరోవైపు చివరి వన్డేలోనైనా గెలవాలని న్యూజిలాండ్ జట్టు ప్రయత్నిస్తోంది. మూడో వన్డే మ్యాచ్ కు భారత జట్టులో రెండు మార్పులు చేసే అవకాశం ఉంది. సిరాజ్, షమీలలో ఒకరికి విశ్రాంతి ఇచ్చి ఉమ్రాన్ మాలిక్ కు అవకాశం ఇవ్వనున్నారు. స్పిన్నర్ చాహల్ ను సైతం జట్టులోకి తీసుకోనున్నారు.