సత్యసాయి: జిల్లాలో రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ త్రీ వీలర్ల కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు బుధవారం అర్హత శిబిరం నిర్వహించారు. సంయుక్త కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధ్యక్షతన పీజీఆర్ఎస్ హాల్లో ఈ ఇంటర్వ్యూలు జరిగాయి. ఆరు నియోజకవర్గాలకు చెందిన 94 మంది విభిన్న ప్రతిభావంతులు ఈ శిబిరానికి హాజరయ్యారు. జిల్లా కమిటీ సభ్యులు అభ్యర్థుల అర్హతలను పరిశీలించారు.