ఎన్నికల వేళ టీ, బిర్యానీ, బైక్, బస్ రెంటల్, పూల ధరలకు రెక్కలు వచ్చాయి. వాటితో అవసరం కాబట్టి.. ధర ఎంతయినా సరే ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులు ఖర్చు పెడుతున్నారు.
TS Polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ చిరు వ్యాపారులకు మేలు జరుగుతుంది. ఎన్నికలు ఉండటంతో సభలు, సమావేశాల కోసం జనం తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఏదైనా మీటింగ్ జరిగితే చాలు ఛాయ్ (tea) కంపల్సరీ.. మధ్యాహ్నాం వరకు కొనసాగితే లంచ్ పెట్టియాల్సిందే.. మాములు భోజనం ఎందుకు.. బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారు.
టీ కొట్టు వాళ్లు, మెస్ (mess) వారికి డిమాండ్ ఏర్పడింది. పనిలో పనిగా ధరలను కూడా పెంచేశారు. సభ స్థలికి జనాన్ని తీసుకొచ్చేందుకు బస్సులు, కార్లు కావాలి. యువతకు బైక్ ఇప్పించాల్సి ఉంటుంది. అందరికీ టూ వీలర్ ఉండదు కనుక.. ఎమ్మెల్యే అభ్యర్థి బైక్, బస్, కార్లను అద్దెకు తీసుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లిళ్లు కూడా ఉన్నాయి. ప్రచారానికి డిమాండ్ ఉండటంతో ధరను కాస్త పెంచేశారు. అయినప్పటికీ అభ్యర్థులు వెనకాడటం లేదు.
ఫంక్షన్ హాల్స్ కూడా బుక్ చేసుకుంటున్నారు. సభలు, సమావేశాల కోసం ముందుగానే బుక్ చేసుకున్నారు. అసలే పెళ్లిళ్లు కాగా.. కాస్త డబ్బులు ఎక్కువ ఇచ్చి రిజర్వ్ చేసుకున్నారు. పూల ధరలకు కూడా డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ రంగు అయిన పింక్, ఆరెంజ్, వైట్ పూలకు తెగ గిరాకీ ఉంది. పెళ్లిళ్ల సమయం.. ఆపై కార్తీక మాసం కావడంతో పూలకు డిమాండ్ ఉంది. అయినప్పటికీ పొలిటిషీయన్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇంకేముంది పూల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి.
తమకు ఆ పూలు కావాలి కాబట్టి.. క్యాండెట్స్ వెనకడుగు వేయడం లేదు. ఎంత ఖర్చయినా సరే.. ఓకే అని పెడుతున్నారు. ఖర్చును లెక్క చేయడం లేదు. గెలవాలనే ఉద్దేశంతో కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఇంత మొత్తం ఖర్చు చేయాలనే ఎన్నికల సంఘం నిబంధన ఉన్నప్పటికీ.. దానిని ఏ ఒక్క అభ్యర్థి పాటించడం లేదు.