TG: సిద్దిపేటలోని హుస్నాబాద్‌లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పత్తిలో తేమ శాతాన్ని పరిశీలించారు. ‘కపాస్ కిసాన్ యాప్’ ద్వారానే కొనుగోళ్లు జరుగుతాయని, జిన్నింగ్ మిల్లు ఉన్న కేంద్రంలో రైతులకు తేదీ స్లాట్ ఇస్తారని ఆయన తెలిపారు. పత్తికి ప్రస్తుతం రూ.8,100 మద్దతు ధర ఉందని మంత్రి స్పష్టం చేశారు.