E.G: కడియం మండలం కడియపులంక గోకుల్ నర్సరీ సమీపంలో 216ఏ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది ఒకరు మృతి చెందినట్లు హైవే పెట్రోలింగ్ అధికారులు తెలిపారు. గాజువాక అగనంపూడికి చెందిన దాసరి కిరణ్ కుమార్ (26) విజయవాడ నుంచి విశాఖపట్నం కారులో వెళుతుండగా బుధవారం కడియపులంక వద్ద ఆగి ఉన్న లారీని అదుపుతప్పి ఢీకొనడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు చెప్పారు.