గుంటూరు జిల్లా పోలీస్ శాఖ పాత వస్తువుల బహిరంగ వేలం మార్చి 26న నిర్వహించనుంది. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సాయంత్రం 4 గంటలకు RI స్టోర్లో ఈ వేలం జరుగుతుంది. టెంట్లు, కుర్చీలు, సమియానాలు, ప్లాస్టిక్ డ్రమ్ములు, ఫ్యాన్లు, టార్చ్లైట్లు తదితర వస్తువులు ఈ వేలంలో అందుబాటులో ఉంటాయి. ఆసక్తి గల వారు పాల్గొని కొనుగోలు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.