Viral Video : సాధారణంగా బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తే వాటి కిటికీలు తెరుచుకోవచ్చు. కానీ.. విమానంలో అది సాధ్యం కాదు. విమానంలో కిటికీ తెరవడం కుదరదు. అవి ఫిక్స్ చేసి ఉంటాయి. కేవలం విండో పక్కన కూర్చొని బయటి అందాలను చూడగలం కానీ.. ఆ కిటికీని తెరవలేం. కానీ.. ఓ ప్యాసెంజర్ మాత్రం విమానం కిటికీ తెరిస్తే తాను గుట్కా ఉమ్మేస్తానని.. ఎయిర్ హోస్టెస్ ను పిలిచి మరీ రిక్వెస్ట్ చేశాడు.
ఈ ఘటన ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. ప్యాసెంజర్ చేసిన రిక్వెస్ట్ కు ఎయిర్ హోస్టెస్ కు ఏం చేయాలో అర్థం కాక వెంటనే నవ్వేసింది. అయితే.. ఇది ఆ ప్యాసెంజర్ కేవలం సరదా కోసం చేసిందే అని అనిపిస్తోంది. ఎందుకంటే.. విమానం ఎక్కే ప్రతి ప్యాసెంజర్ కు విమానంలో ఉండే విండోస్ తెరుచుకోవని తెలుసు.
Viral Video : ఎయిర్ హోస్టెస్ ను ప్యాసెంజర్ ఆటపట్టించిన వీడియో వైరల్
ఎయిర్ హోస్టెస్ ను కావాలని ఆ ప్యాసెంజర్ ఆటపట్టించాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల విమానాల్లో అనుకోని సంఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎయిర్ హోస్టెస్ లతో ప్రయాణికులు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు ఇప్పటికే చాలా జరిగాయి. తాజాగా జరిగిన ఘటన మాత్రం సరదాగా ఉందని.. ఆ వీడియోను చూసి తెగ నవ్వుకుంటున్నామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.