మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’ అక్టోబర్ 5న రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అందరి ఆశ ఈ సినిమా పైనే ఉంది. ఇటీవల భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఆచార్య’ ఫ్లాప్‌గా నిలవడంతో.. మెగాస్టార్ కూడా గాడ్ ఫాదర్‌తో మరోసారి బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు. అందుకే మలయాళీ బ్లాక్ బస్టర్ హిట్ ‘లూసిఫర్’ రీమేక్‌తో రాబోతున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన గాడ్ ఫాదర్లో.. నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో గాడ్ ఫాదర్ పై భారీ అంచనాలున్నాయి.
ఇక రిలీజ్ టైం దగ్గర పడడంతో ఈ సినిమా ప్రమోషన్స్‌కు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ఫైనల్ అవుట్ పుట్ చూసినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో మూవీ యూనిట్ కాస్త టెన్షన్‌గా ఫీలైన.. చిరు రియాక్షన్ చూసి హ్యాపీగా ఉన్నట్టు టాక్. గాడ్ ఫాదర్ చూసిన తర్వాత అద్భుతంగా ఉందని.. దర్శకుడు మోహన్ రాజాని మెగాస్టార్ ప్రశంసించినట్లు సమాచారం. ఊహించినట్టుగానే సినిమా అవుట్ పుట్ వచ్చిందని చెప్పారట. దాంతో గాడ్ ఫాదర్ పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ఇక ‘గాడ్ ఫాదర్’కు మెగా టాక్ పాజిటివ్‌గా రావడంతో.. ప్రమోషన్స్‌ను పరుగులు పెట్టించేందుకు రెడీ అవుతోందట చిత్ర యూనిట్. మరి భారీగా అంచనాలు పెంచేస్తున్న ‘గాడ్ ఫాదర్’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.