KDP: APCC చీఫ్ షర్మిలా YCPపై ఘాటు విమర్శలు చేశారు. పులివెందుల బనానా ప్రాసెసింగ్ యూనిట్ ఎన్నికల స్టంట్ మాత్రమేనని, వాస్తవానికి పనులు జరగలేదని ఆరోపించారు. తాను ప్రభుత్వాన్నే ప్రశ్నించానని, జగన్ తన టార్గెట్ కాదని స్పష్టం చేశారు. అరటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కోల్డ్ స్టోరేజ్ లేక రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.