NRML: జేబీఎస్ (సికింద్రాబాద్) నుంచి నిర్మల్, ఖానాపూర్ మీదుగా రాత్రి 10:20కి సూపర్ లగ్జరీ బస్సు సేవ ప్రారంభమైనట్లు డిపో మేనేజర్ పండరి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ నిర్మల్ డిపో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ప్రజలు ఈ అవకాశం వినియోగించుకోవాలని డిపో మేనేజర్ పండరి సూచించారు.