HYD: రానున్న 2-3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, కామారెడ్డి, మేడ్చల్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని వెల్లడించింది. గంటకు 41-61 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది.