ASR: డుంబ్రిగుడ మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్ టవర్లకు ఇంకా నెట్వర్క్ ప్రారంభం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ నాయకుడు వంతాల గురు నాయుడు అన్నారు. ఈ సమస్యపై బిఎస్ఎన్ఎల్ అధికారులకు వినతిపత్రం బుధవారం అందజేశారు. ఫైబర్ కేబుల్ తెగిపోవడం వల్ల ఆలస్యం జరిగిందని అధికారులు తెలిపారు.