BDK: ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు 108 సేవలు నిరంతరం అందుబాటులో ఉండాలని డివిజన్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ దానోజుల మనోహర్ అన్నారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలోని 108 అంబులెన్స్‌ను ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రోగ్రాం మేనేజర్ నజీరుద్దీన్ ఆదేశాల మేరకు వాహనంలోని వైద్య పరికరాలు, మందుల నిల్వలు ఆయన పరిశీలించారు.