W.G. భీమవరం కొలువైన శ్రీ శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ వద్ద మహాలక్ష్మీ, నగేష్ పాల్గొని మాట్లాడుతూ.. 26 రోజులకు హుండీ లెక్కించగా రూ. 25,63,619 నగదు 30 గ్రాముల బంగారం, 55 గ్రాములు వెండి విరాళంగా లభించింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు పాల్గొన్నారు.