SRCL: అక్రమ కేసులకు భయపడేది లేదని బీఆర్ఎస్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న అన్నారు. తంగళ్ళపల్లిలోని పోలీస్ స్టేషన్ ముందు బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ను విచారణ పేరుతో వేధిస్తున్నందుకు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసామన్నారు. దానికి గాను 18 మంది బీఆర్ఎస్ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టారని వాపోయారు. కేసులకు భయపడేది లేదన్నారు.