NLG: గ్రంథాలయాలు జ్ఞానానికి నిలయాలని కట్టంగూర్ ఎంపీడీవో పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు, సర్పంచ్ శ్యామల అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇవాళ కట్టంగూర్ శాఖ గ్రంథాలయంలో పుస్తక పఠనం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. పుస్తక పఠనం మనిషి ఆలోచన విధానాన్ని మార్చి, వ్యక్తిత్వ వికాసానికి దోహద పడుతుందన్నారు.