RR: మియాపూర్ 240 డివిజన్ నాయకుడు అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్‌ను ఎమ్మెల్యే గాంధీ ఈరోజు ప్రారంభించారు. పేద ప్రజలకు అత్యవసర సమయాల్లో వేగంగా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ నిర్ణయాన్ని ఎమ్మెల్యే అభినందిస్తూ, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.