NGKL: అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ తాలూకా అధ్యక్షుడు నిరంజన్ అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడంతో కల్వకుర్తి పోలీసులు పలువురు జర్నలిస్టు నాయకులను బుధవారం ఉదయం ముందస్తు అరెస్టు చేశారు. పోలీసుల అక్రమ అరెస్టులను వారు తీవ్రంగా ఖండించారు.