GDWL: గట్టు మండలం చిన్నోనిపల్లి R&R సెంటర్ గ్రామంలో బుధవారం శ్రీ ఆంజనేయ స్వామి, గణపతి, బొడ్రాయి, లింగమయ్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. గ్రామాభివృద్ధిలో ఐక్యత, ఆధ్యాత్మికత ముఖ్యమని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.