MDK: రామాయంపేటలోని మల్లెచెరువు తూము కాలువలో పేరుకుపోయిన ముళ్ల పొదలు, చెత్తాచెదారాన్ని జేసీబీ సహాయంతో బుధవారం తొలగించారు. 99వ ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ లో భాగంగా పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి ఆధ్వర్యంలో, మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు పర్యవేక్షణలో ఈ పనులు చేపట్టారు. వర్షాకాలం దృష్ట్యా నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.