NZB: సిరికొండ మండలం న్యావనందిలో అడవి పంది మాంసం అమ్మిన వ్యక్తిపై కేసు నమోదైంది. శివరాత్రి గంగాధర్‌ను కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి నర్సింగ్ రావు తెలిపారు. అటవీ చట్టం-1972 ప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు. అటవీ జంతువులు వేటాడటం చట్ట రీత్యా నేరమని హెచ్చరించారు. గ్రామాల్లో వేటాడినట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.