MBNR : బాలానగర్ మండలం పెద్దరేవల్లిలో వీధికుక్కలు బీభత్సం సృష్టించాయి. రైతు కొండకళ్ల జంగయ్యకు చెందిన మేకల మందపై కుక్కలు దాడి చేయడంతో 12 మేక పిల్లలు మరణించాయి. వర్షం పడుతుండటంతో రైతు ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు రూ.50 వేల పైగా నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు కన్నీటిపర్యంతమయ్యాడు.