BHPL: జిల్లా కోర్టులో ఈనెల 28న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా SP సంకీర్త్ గౌడ్ అన్నారు. రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలను పరస్పర సమ్మతితో పరిష్కరించుకోవచ్చని, దీని వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని ఆయన తెలిపారు. రాజీ మార్గమే రాజా మార్గమని ఆయన పేర్కొన్నారు.