W.G: శ్రీరామ నవమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తణుకు డిపో నుంచి భద్రాచలం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు తణుకు ఆర్టీసీ డిపో మేనేజర్ సుధారాణి తెలిపారు. ఈ నెల 26న రాత్రి 8 గంటలకు భద్రాచలంకు సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేశామని చెప్పారు. టికెట్ ధర పెద్దలకు రూ.380, పిల్లలకు రూ.210 ఉంటుందని, రిజర్వేషన్ సదుపాయం కూడా ఉందని పేర్కొన్నారు.